Preloader Close

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.

ఈ రోజు వుత్తూరు నందు గల మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో గౌరవనీయులైన పుత్తూరు అడ్వికేట్ యన్. మురుగేషన్ రెడ్డి గారు మాట్లాడుతూ….

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజు యొక్క ముఖ్య లక్ష్యం ప్రజలకు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం అని తెలిపారు. ప్రపంచంలో మొదటి సారి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను రిచర్డ్ హంటర్ అక్టోబర్ 10, 1992 వ సంవత్సరంలో జరిపారు. 1994 వ సంవత్సరం వరకు ఎలాంటి నేపథ్యం లేకుండానే ప్రజలకు మానసిక ఆరోగ్యం గురించి ప్రచారం చేసి అవగాహన కలిపించే వారని తెలియజేశారు.

అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మానసిక ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించిందని, 2022 వ సంవత్సరంలో అందరికీ మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రపంచ ప్రాధాన్యతగా చేయాలి అనే నేపథ్యంతో అక్టోబర్ 10 ను ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారని తెలియజేశారు.

ఈ యొక్క సమావేశానికి మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లలు, ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు మరియు వృద్ధులు పాల్గొన్నారు. వీరందరికీ జి.శంకర్ గారు మరియు జి. రాజేశ్వరి గారు అన్నదానం చేశారు.

కటారి శివయ్య 9441775448; 7207245448

Leave A Comment