Preloader Close

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంది.

ఈ రోజు పుత్తూరు నందు గల మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లల పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఆంధులుగా విచ్చేసిన వేదవ్యాస కాలేజ్ లెక్చరర్ గౌరవనీయులైన శ్రీ పి.సుధాకర్ వర్మ గారు మరియు శ్రీమతి పి.హరిత గారు పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పి.నాగేంద్ర వర్మ గారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గొప్పతనాన్ని మరియు ఆయన చేసిన త్యాగాలను గురించి తెలిపారు. వల్లభాయ్ పటేల్ భారతదేశపు ఉక్కు మనిషి ఈయన అక్టోబర్ 31న జన్మించారు. ఈయన భారతస్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన సామాజిక, రాజకీయ నాయకుడు మరియు స్వతంత్య భారతదేశ సమగ్రతని కాపాడిన వ్యక్తి.

గుజరాత్‌లో జన్మించిన సర్దార్ పటేల్ ఖ్యాతిని అంతర్జాతీయంగా చిరస్థాయిగా నిలపాలని నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంకల్పించి శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లో 182 నియోజక వర్గాలున్న నేపథ్యంలో పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లు ఉండేట్లుగా నిర్మిస్తున్నారు. అంటే ఈ విగ్రహం ఎత్తు 597 అడుగుల ఎత్తు ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. 19వేల చదరపు కిలోమీటర్ల వ్యాసార్ధంలో 2989 కోట్ల భారీ ఖర్చుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు[2]. ఈ విగ్రహం నిర్మాణం అక్టోబర్ 2014లో ప్రారంభించి అక్టోబర్ 2018 లో అనగా 4 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేశారు. దీని కోసం 75వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 5వేల 700 టన్నుల ఉక్కు, 18వేల 500 టన్నుల స్టీలు రాడ్లు, 22వేల 500 టన్నుల రాగి షీట్లు వినియోగించారు. ఈ భారీ విగ్రహాన్ని నిర్ణీత గడువులోపు తయారీ పనులు ముగించేందుకు 2500 మందికి పైగా కార్మికులు పనిచేశారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదిగా నిర్మిస్తున్న సర్ధార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం.

ఈ సంద్భంగా గౌరవనీయులైన. నుధాకర్ గారు బధిర పిల్లలందరికీ అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదర్ థెరిస్సా పిల్లల పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది..

Leave A Comment