Preloader Close

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన జాతీయ క్యాన్సర్ అవగాన దినోత్సవం.

ఈ రోజు వుత్తూరు నందు గల మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లల పాఠశాలలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నమకదేశంలో పాఠశాల యొక్క విధానోపాధ్యాయులు గారు ప్రసంగిస్తూ.. ఈ రోజు నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని క్యాన్సర్ చికిత్సలో సహాయంచుతున్న న్యూక్లియర్ ఎనర్జీ రేడియో థెరఫీ అభివృద్ధికి కారణమైన ప్రయోగం చేసిన నోబెల్ గ్రహీత మేద్యం సెల్ జయంతాం పురస్కరించుకొని దీనిని జరుపుకుంటున్నామని తెలిపారు. క్యాన్సర్ రావడానికి కారణాలు, లక్షణాలు నివారణ, చికిత్స గురించి ఫ్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం అని తెలియజేశారు. మన దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోందని, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని భారత్ లో ఇప్పటికే కొన్ని కోట్ల మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని ప్రతి 8ని ఒక మహిళ గర్భాశయ కాన్సర్ తో మరణిస్తున్నారని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషక ఆహరం తీసుకోవడం చాలా ముఖ్యమని, మన డైట్లో మొక్కల ఆధారిత ఆహార వివరాలను ఎక్కువగా తినాలని తెలిపారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా గౌరవనీయులైన శ్రీ యం. శ్రీమంత్ గారు మరియు వారి స్నేహితులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమంత్ గారు పిల్లలందరికీ అన్నదానం చేశారు.

Leave A Comment