Preloader Close

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన ప్రపంచ సైన్ లాంగ్వేజ్ దినోత్సవం.

ఈ రోజు(23-09-2022) వుత్తూరు నందు గల మదర్ థెరిస్సా బధిర మరియు బుద్ధిమాంద్యత పిల్లల పాఠశాలలో ప్రపంచ సాంకేత దినోత్సవం వేడుకలను ( International sign language day ) ఈ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.

              ఈ సమావేశానికి ముఖ్య అతిఖలుగా విచ్చేసిన గౌరవనీయులు మండల లీగల్ సర్వీస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మేనల్ న్యాయవాది అయిన యస్. మురుగేషన్ రెడ్డి గారు మాట్లాడుతూ….మనం మాట్లాడుకొనే భాష బధిరులకు అర్థం కాదు. బధిరుల కోసం ప్రత్యేకంగా గుర్తించి, అభివృద్ధి చేసిన భాషే సంజ్ఞ భాష. దీన్నే సైన్ లాంగ్వేజ్ అంటారు. ఈ సైన్ లాంగ్వేజ్ ప్రాముఖ్యతను మరింతగా పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న అంతర్జాతీయ సంజ్ఞ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మొదటిసారి ఈ సంజ్ఞ భాషను 2018 లో వారోత్సవాలతో ప్రారంభించారు.

                   ప్రతి ఏడాదిప్రపంచ డెఫ్ సమాఖ్య ద్వారా ఒక థీమ్ ప్రతిపాదిస్తారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెవిటి వారి సమైఖ్యతతో ప్రారంభించారు. ఈ సంజ్ఞ లతో మాట్లాడే భాష సహజ భాష కంటే భిన్నంగా ఉంటుందని తెలియజేసారు. అదేవిధంగా ఆధిర వ్యక్తుల మానవ హక్కుల కోసం సంకేత భాష ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ఈ రోజును యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రకటించిందని చెప్పారు. బధిరులు ఎదుగుదలకు అభివృద్ధికి సంకేత భాషలో నాజ్యమైన విద్యతో పాటు ఈ భాషకు సేవల కోసం ఈ రోజు ప్రధాన లక్షంగా ఈరోజును నిర్వహించబడుతుందని తెలియజేశారు.

అనంతరం ఈ పాఠశాలలో గత 15 సంవత్సరాలుగా సేవలు అందించిన బధిర ఉపాధ్యయులు అయినటువంటి సి, ప్రదీప్ సార్ గారిని ముఖ్య అతిథిలుచే సన్మానించడం జరిగింది. అనంతరం పాఠశాల సెక్రటరీ కటారి శివయ్య గారు మాట్లాడుతూ దివ్యాంగుల పిల్లలకు చేయూతనిస్తే ఎంత వరకైనా ఎదగగలరని, వీరికి సానుభూతి కన్నా చేయూత మిన్న అని తెలియజేస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి అన్నీ రకాల సహాయ సహకారాలు అందించిన వారందరికి ధన్యవాదాలు తెలియజేశారు.

               ఈ రోజు సందర్భంగా ఈ పాఠశాలలో ఉదయం ప్రముఖులు శ్రీ యం.జె. సతీష్ గారు పిలల్లకు అల్పాహారం పెట్టడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులైన చంద్రశేఖర్ బాలు గారు పిల్లలకు అన్నదానం, నోటు పుస్తకాలు, పెన్లు పంచిపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దాతలు పాల్గొన్నారు.

సెక్రటరీ కటారి శివయ్య గారు : 9441775448 7207245448

One Reply to “International Sign Language Day Celebrations”

Deendayal Upadhyaya Birth Anniversary Celebrations – NYSS Services

[…] International Sign Language Day Celebrations […]

Leave A Comment