Preloader Close

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన ప్రపంచ వినికిడి దినోత్సవం (World Deaf Day)

ఈ రోజు పుత్తూరు నందు గల మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లల పాఠశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన గౌరవనీయులైన ఎ. హరినాథ్ రెడ్డి గారు (M.A. Eng, M.A.His, M.Ed & Principal and Correspondent Jnana Jyothi and Sri Sai Jyothi Institution Puttur). మాట్లాడుతూ….. ప్రస్తుత ప్రపంచంలో సౌండ్ ఇంజినీర్లు (చెవిటి వారు) అందరితో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు సమాజంలో చులకనగా, హేళనగా చూడబడిన వీరు.. ప్రస్తుత రోజుల్లో వినికిడి విజ్ఞానం డెవలప్ కావడంతో సమాజంలో అందరితో సమానంగా గౌరవ, మర్యాదలు పొందుతున్నారు. చాలా మంది సౌండ్ ఇంజనీర్లు హాయిగా చదువుకుంటున్నారు.. కొంతమంది ఉద్యోగాలను సైతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సౌండ్ ఇంజనీర్లందరికీ కలిపి ఓ సంఘం ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం రోజున ప్రపంచ వినికిడి మెరుగు పరిచే (World Deaf Day) దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా వినికిడి సమస్యతో బాధపడుతుండే వారందరికీ ఒక సంఘం ఉండాలన్న ఉద్దేశ్యంతో 1951లో ఇటలీలోని రోమ్ లో రూపకల్పన చేశారు. ఇది అంతర్జాతీయ ప్రభుత్వేతర సెంట్రల్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో 130 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అని తెలియజేసారు.

అనంతరం పాఠశాల కార్యదర్శి కటారి శివయ్య గారు మాట్లాడుతూ దేశం, జాతి, మతం, లింగ వివక్ష. ఇతర ప్రాధాన్యాలు, భేదాలు లేకుండా ప్రజలందరితో సమానంగా మానవ హక్కులు, గౌరవ మర్యాదలు ఒకేలా ఉండాలన్నది ఈ సిద్ధాంతం. అందుకే దీనిని ప్రతి ఏటా సెప్టెంబర్ చివరి ఆదివారం నాడు జరుపుకోవాలని నిర్ణయించారని తెలిపారు.

అనంతరం 2020, 22 వ సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించిన బధిర విద్యార్థి యన్. హేమంత్ ని గౌరవనీయులైన ఎ. హరినాథ్ రెడ్డి గారి చేత ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సమాజంలో ఎవరైతే వినికిడి సమస్యతో బాధపడుతుంటారో.. వారందరికీ ఉత్తమ విద్య, సమాచారం. ఇతర సేవల్ని అందించడం, వర్ధమాన దేశాల్లో వినికిడి శక్తి లేని వారి మానవహక్కుల్ని మెరుగుపరచడం. ప్రస్తుతం ఎక్కడైతే ఈ ఆర్గనైజేషన్లు లేవో అక్కడ వాటిని నెలకొల్పడం దీని ప్రధాన సిద్ధాంతమని తెలియజేశారు.

ఈ సమావేశంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

కటారి శివయ్య 9441775448 7207245448

National Cancer Awareness Day

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన జాతీయ క్యాన్సర్ అవగాన దినోత్సవం. ఈ రోజు వుత్తూరు నందు గల మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లల పాఠశాలలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నమకదేశంలో పాఠశాల యొక్క ...

National Unity Day

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంది. ఈ రోజు పుత్తూరు నందు గల మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లల పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఆంధులుగా ...

World Mental Health Day Celebrations

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈ రోజు వుత్తూరు నందు గల మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో గౌరవనీయులైన ...

Leave A Comment