Preloader Close

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం.

ఈ రోజు పుత్తూరు నందు గల మదర్ థెరిస్సా బర్యాంగుల పిల్లల పాఠశాలలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిలుగా మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులైన శ్రీ ఎ. హరి గారు మరియు గవర్నమెంట్ హోమియో మెడికల్ ఆఫీసర్ గౌరవనీయులైన దా.. సునిత గారు విచ్చేసారు.. ఈ సమావేశంలో గౌరవనీయులైన శ్రీ ఎ. హరి గారు మాట్లాడుతూ… పించి వ్యప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని మొదటి సారిగా అక్టోబర్ 1,1991 సంవత్సరంలో నిర్వహించారు. మన దేశంలోనే 60 ఏళ్ళకు మించిన వృద్ధులు ॥ కోట్ల మంది ఉన్నట్లు జనాభా లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. మరో 20 ఏళ్ళలో ఈ సంఖ్య రెట్టింపు. కాగలదని అంజనా. అనగా మనిషి జీవన పరిణామం పెరుగుతుంది. అదేవిధంగా దేశాన్ని పాలిస్తున్నది కూడా వృద్ధ నేతలే. అయినప్పటికీ వయోవృద్ధుల సమస్యలకు పరిష్కారం కనబడక పోవడం అసలైన విషాదం.

కావున మన పిల్లల ముందు వృద్ధులను కింజవరచకుండా వారి ప్రాధాన్యాన్ని పిల్లలు తెలుసుకునేలా చేయండని చెప్పారు. వృద్ధలు ప్రశాంతంగా కాలం గడపడానికి అవసరమైన చేయూతను అందించా అని సభాముఖంగా తెలిజేశారు.

ఈ వేడుకలో వృద్దులను ఆహ్వానించి గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ శ్రీ ఎ. హరి గారి చేతుల మీదుగా వస్త్రదానం మరియు అన్నదానం నిర్వహించి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా హోమియో మెడికల్ ఆఫీసర్ గౌరవనీయులైన డా.బి. సునిత గారు వృద్ధులకు ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సూచనలు. సలహాలు తెలియపరుస్తూ వారికి కావలసిన హోమియో మందులు అందజేశారు.

ఈ సందర్భంగా మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లల పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులైన కె.శివయ్య గారు మాట్లాడుతూ ఈ రోజు నుండి వృద్ధులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి పాల్గొనడం జరిగింది.

ఈ ప్రపంచ వయోవృద్ధుల రోజున ఏర్పాటు చేయడం ఒక శుభసంకల్పంగా భావించి ప్రారంభించడం జరిగింది.

ఈ సమావేశంలో పాఠశాల సిబ్బంది, వయోవృద్ధులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు.

Leave A Comment