Preloader Close

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి దినోత్సవం.

ఈ రోజు పుత్తూరు నందు గల మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లల పాఠశాలలో మహాత్మా గాంధీ జయంతి దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ యొక్క సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మాట్లాడుతూ … మన జాతిపిత మపాక్స్, గాంధీ గారి గొప్పదనాన్ని గురించి తెలిపారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 3వ తేదీన జన్మించారని, అహింసే ఆయుధంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి.. దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ. తెల్లదొరలను తరిమికొట్టేందుకు అప్పట్లో ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు పోరాడారని, తమ ప్రాణాలు సైతం త్యాగం చేశారని పిల్లలకు తెలియజేశారు. అందుకే ఆయన జననాన్ని ఏటా అహింసా దినోత్సవంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా మహాత్ముని జయంతి పురస్కరించుకొని ప్రపంచానికి ప్రేరణగా ఉండాలని కోరారు..

ఈ యొక్క సమావేశానికి మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లలు. ఉపాధ్యాయులు మరియు వృద్ధులు పాల్గొన్నారు. వీరందరికీ నాగూర్ గారు మరియు విచ్చమ్మ గారు అన్నదానం చేశారు.

Leave A Comment